![]() |
![]() |

ఆర్జీవీ మూవీస్ చూడడం అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మూవీ తీయడం ఒక ఎత్తైతే..దాని రిలీజ్ కి ముందు చేసే ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ఆర్జీవీ మూవీ వస్తూనే కాంట్రోవర్సిని వెంటబెట్టుకుని మరీ వస్తుంది. ఎన్నో హిట్ మూవీస్ తీసిన ఆర్జీవీ లాస్ట్ ఇయర్ "డేంజరస్ " అనే మూవీని తీశారు. అది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. నైనా గంగూలి, అప్సరా రాణి కలిసి నటించిన ఈ లెస్బియన్ మూవీలో ఎక్కువ శాతం అడల్ట్ కంటెంట్ తోనే ఉంటుంది. ఐతే ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యింది కానీ ఇంతవరకు ఓటిటి ప్లాట్ఫారం మీదకు మాత్రం రాలేదు. ఏ మూవీ ఐనా థియేటర్లో రిలీజ్ కాగానే ఒక నెలకో రెండు నెలలకో ఓటిటి మీదకు వచ్చేస్తోంది. కానీ డేంజరస్ మూవీ మాత్రం రిలీజ్ అయ్యి 8 నెలలు అయ్యింది.
కానీ ఇంత వరకు ఓటిటి మీదకు రాలేదు. ఐతే నెటిజన్స్ ఈ మూవీ గురించి అడుగుతున్న ప్రశ్నలకు అప్సరరాణి తన ఆన్సర్ ని స్టేటస్ లో పోస్ట్ చేసింది. "డేంజరస్ మూవీ ఇంకా ఓటిటిలో విడుదల కాలేదంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు...ఐతే ఆ మూవీని చూడాలనుకునే మీ ఆసక్తి నాకు అర్ధమవుతోంది. కానీ ఈ మూవీలో నటించినందుకు, ఈ మూవీ టీమ్ లో ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీని రిలీజ్ చేసే సమయంలో పక్షపాత ధోరణితో ఉన్న వాళ్ళను ఎదుర్కొని మరీ ఈ మూవీని డిసెంబర్ 9 న రిలీజ్ చేసాం. ఇక ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకూ తెలీదు ఎందుకంటే మూవీని ఓటిటికి ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఆ మూవీ మేకర్స్ డెసిషన్ ..లెస్బియన్ క్రైమ్ డ్రామా ఐనా కూడా నేను ఇద్దరి స్త్రీల మధ్య ప్రేమను నమ్ముతాను " అని చెప్పింది అప్సర రాణి. "క్రాక్" మూవీలో రవితేజతో స్టెప్పేసి ఆడియన్స్ కి కిక్కిచ్చింది అప్సర. దీంతో హాట్ బ్యూటీగా ప్రేక్షకుల మనస్సులో చోటు సంపాదించుకుంది.. ఇక తన హాట్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రీ టైం దొరికితే చాలు బీచుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ భామ.
![]() |
![]() |